: సంతకం ఫోర్జరీపై జైరాం రమేశ్ ఫిర్యాదు


రైల్వేలో అత్యవసర రిజర్వేషన్ల కోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. రైల్వేలో మంత్రులు, వీఐపీలు, మీడియా ప్రతినిధులు ఇలా కొన్ని వర్గాల వారికి సాధారణ టికెట్లపైనే అత్యవసరంగా రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేక కోటా ఉంటుంది. కొందరు ముఠా కట్టి మంత్రుల పేరుతో నకీలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో రిజర్వేషన్ టికెట్లు కాజేస్తున్నారు. ఇది కొన్ని రోజుల క్రితం వెలుగు చూసింది. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో పాటు మన రాష్ట్రానికే చెందిన జైపాల్ రెడ్డి, మరికొందరి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. దీంతో ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. రైల్వే ప్రధాన కార్యాలయాలలో తనిఖీలు కూడా నిర్వహించాయి.

  • Loading...

More Telugu News