: ఉత్తరాఖండ్ వరద ప్రాంతాల్లో ప్లేటు భోజనం రూ.500


తీర్థయాత్రలకు వెళ్లి ప్రకృతి తెచ్చిన ప్రళయంలో చిక్కుకున్న వారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఎదుర్కొన్న తమ చేదు అనుభవాలను చెబుతున్నారు. హేమకుండ్ లో తన తాతతో కలిసి చిక్కుకుపోయిన 13 ఏళ్ల హర్మన్ ప్రీత్ ఆకలితో విలవిలలాడుతున్న పరిస్థితుల్లో అక్కడి రెస్టారెంట్ కు వెళ్లగా ప్లేటు భోజనం 500 రూపాయలు, గోధుమ రొట్టె అయితే రూ.180 అని చెప్పారట. చేతిలో డబ్బుల్లేని పరిస్థితుల్లో సమీప గ్రామస్థులను అడిగినా వారు కూడా ఇంత ముద్దపెట్టని హృదయ విదారక పరిస్థితిని ఆమె ఎదుర్కొంది. చేసేదేమీ లేక చెత్తబుట్ట కనిపిస్తే అందులో దొరికిన బ్రెడ్ ముక్క తిని 40 గంటల పాటు నడిచింది. ఎట్టకేలకు స్వరాష్ట్రం పంజాబ్ కు తిరిగి వెళ్లే ముందు ఆమె తన బాధను మీడియాకు వెల్లడించింది.

  • Loading...

More Telugu News