: రైతులను పట్టించుకోకుండా సీఎం ఢిల్లీలో పైరవీలు: చంద్రబాబు
ఓవైపు రాష్ట్రంలో అకాల వర్షాలకు రైతులు ఇక్కట్లు పడుతుంటే, మరోవైపు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పైరవీలు చేయడంపైనే ఆసక్తి చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా కూచిపూడిలో పాదయాత్ర ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, గతంలో సంభవించిన నీలం తుపాను నివేదికను ఇప్పటివరకు కేంద్రానికి సమర్పించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. నష్ట పరిహారం విడుదల చేయడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.