: ఉత్తరాఖండ్ లో నేడు, రేపు ఎంతో కీలకం
వరదల ధాటికి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన వారిని, ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి సహాయక దళాలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. శనివారం, ఆదివారాల్లో సాధ్యమైనంత మందిని రక్షించడానికి, సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి సైన్యం, పారామిలటరీ, జాతీయ విపత్తు స్పందన దళాలు(ఎన్ డీఆర్ఎఫ్) చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే సోమవారం ఉత్తరాఖండ్ లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ రెండు రోజులు తమకు ఎంతో కీలకమని ఎన్ డీఆర్ఎప్ ఐజి సందీప్ రాయ్ తెలిపారు. ఇప్పటికీ వేలాది మంది కేదార్ నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పరిసర ప్రాంతాలలో చిక్కుకుపోయారని భావిస్తున్నారు.