: అడ్డొచ్చిందని.. అత్తకు స్పాట్ పెట్టాడు!


సమాజంలో నానాటికీ మానవీయత మట్టికలుస్తోంది. మనుషుల ప్రాణాలు తృణప్రాయమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన వింటే ఒళ్ళుగగుర్పొడవకమానదు. జిల్లాలోని దేవరపల్లిలో ఓ వ్యక్తి తన భార్య పోచమ్మను చంపే ప్రయత్నం చేశాడు. ఆ దారుణాన్ని అడ్డుకోబోయిన అతడి అత్త లక్ష్మి చివరికి అల్లుడి చేతిలో కడతేరింది. భార్య మీద కసి అత్త మీద ప్రదర్శించిన ఆ వ్యక్తి నిర్దయగా విరుచుకుపడ్డాడు. దీంతో, తీవ్రగాయాలైన అత్త లక్ష్మి అక్కడిక్కడే మరణించింది. భార్య పోచమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అంటున్నారు.

  • Loading...

More Telugu News