: కేదార్ నాథ్ భక్తులకు చేదువార్త
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వణికించిన వరదల కారణంగా భక్తులు మరో చేదువార్త వినాల్సి వస్తోంది. తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జలప్రళయం కేదార్ నాథ్ క్షేత్రాన్నినేలమట్టం చేసిన నేపథ్యంలో.. రెండేళ్ళపాటు కేదార్ నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రకటించారు. ఈ ప్రాంతంలో పునర్నిర్మాణ కార్యక్రమాలు పూర్తవ్వాలంటే ఏళ్ళు పడుతుందని ఆయన చెప్పారు. హిమాలయ పర్వతసానువుల్లో ఇంతటి విపత్తును ఎన్నడూ తాము చూడలేదని, భారీ వర్షాలపై తమకు సరైన సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 556 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా ఎన్నో దేహాలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటాయని బహుగుణ అన్నారు.