: ప్రకాశం జిల్లాలో సైకో


ప్రకాశం జిల్లాలోని కారంచేడు మండలం జరుబులవారిపాలెంలో ఓ ఉన్మాది హల్ చల్ చేశాడు. నల్లూరి ధనుంజయ్ అనే వ్యక్తి గ్రామంలో పిల్లలు, మహిళలపై దాడికి దిగడంతో అతడిని గ్రామస్తులు బంధించి పోలీసులకు సమాచారం అందించారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ధనుంజయ్ గతంలో ఉద్యోగం చేస్తూ మానసిక వ్యాకులతతో బాధపడేవాడు. కొద్దిరోజులకే ఉద్యోగం వదిలేసిన ధనుంజయ్ ఉన్మాదిలా మారి స్వంత నానమ్మ, మేనత్తలను రాడ్డుతో దారుణంగా కొట్టి చంపేశాడు. దీంతో, అతడిని జైలుకు తరలించగా, మానసిక స్థితి దిగజారడంతో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చినా మానసిక వ్యాధి మళ్ళీ తిరగబెట్టింది. దీంతో, ఉన్మాదిలా కనిపించిన వారిపై దాడికి యత్నిస్తుండడంతో గ్రామస్తులు అతడిని పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News