: ఒంటరిగా ఉంటే ప్రమాదమే


ఒంటరిగా ఉండడం వల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మహిళలు ఎక్కువగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉండే వారికి ముఖ్యంగా మహిళలకు మిగిలిన వారితో పోల్చుకుంటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ఉండడం వల్ల కుంగుబాటుకు గురవుతారని, దానివల్ల వాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

ఆష్ట్రేలియాలో సుమారు పన్నెండేళ్ల పాటు 42 నుండి 52 ఏళ్ల మధ్య వయసున్న పదివేలమంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇంట్లో సభ్యుల నిరాదరణకు గురికావడం, ఇతర ఆర్ధిక సమస్యలు ఇలాంటివన్నీ మహిళలను మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తున్నాయని దీని ఫలితంగానే మహిళలకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల మహిళలు ఇలాంటి వాటి ప్రభావం తమపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News