: ఈ పాత్ర ఖరీదు రూ.9 కోట్లట!


ఒక పాత్ర ఖరీదు కేవలం 9 కోట్లు... అదేమైనా బంగారందా... లేదా వజ్రాలేమైనా దానిలో పొదిగారా? అని మీకు కుతూహలంగా ఉందా... అయితే అలాంటిదేమీ కాదు... అదో పింగాణి పాత్ర మాత్రమే... కానీ ధరే అంత పలికింది... ఏంటీ ఆశ్చర్యంగా ఉందా... అయితే ఇది మామూలు పింగాణి పాత్ర కాదులెండి. అది ప్రత్యేకమైంది. ఎందుకంటే దీనిపైన పికాసో చిత్రించిన చిత్రం ఉందిమరి!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు పాబ్లో పికాసో ఒక పింగాణి పాత్రపై అందమైన చిత్రాలను చిత్రించాడు. ఈ పింగాణి పాత్రను లండన్‌లోని క్రిస్టీస్‌ సంస్థ బుధవారం నాడు వేలం వేసింది. ఇప్పటి వరకూ అమ్ముడైన పికాసో చిత్రించిన పింగాణీ పాత్రల్లో కల్లా ఈ పాత్ర అత్యధిక ధరను పలికింది. వేలంలో 9 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించిందని క్రిస్టీస్‌ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News