: ఉమేశ్ యాదవ్ క్రమశిక్షణ అలవర్చుకోవాలి: కపిల్ దేవ్
వర్ధమాన పేసర్ ఉమేశ్ యాదవ్ క్రమశిక్షణ అలవర్చుకుంటే ఉన్నతస్థానానికి ఎదుగుతాడని విఖ్యాత ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతే ఉమేశ్ విజయవంతమైన ఫాస్ట్ బౌలర్ గా తయారవుతాడని కపిల్ పేర్కొన్నాడు. అన్ని సమయాల్లో వేగం ఒక్కటే సరిపోదని, కొన్నేసి సార్లు బుర్ర ఉపయోగించాలని సలహా ఇచ్చాడు. వికెట్లు లభించని సమయాల్లో లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బౌల్ చేస్తే ఫలితం లభిస్తుందని సూచించాడు. ప్రస్తుతం కపిల్ ఇంగ్లండ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో హిందీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు.