: శోభా కరంద్లాజేకు 'యుగాంతం' సినిమా గుర్తొచ్చిందట!


ఉత్తరాఖండ్ వరద బీభత్సంపై కర్ణాటక మాజీ మంత్రి, యడ్యూరప్ప సన్నిహితురాలు శోభా కరంద్లాజే స్పందించారు. చార్ ధామ్ యాత్రకు వెళ్ళిన శోభా.. అక్కడి వరదలను చూస్తే '2012 యుగాంతం' సినిమా జ్ఞప్తికి వచ్చిందని తెలిపారు. శోభా వెయ్యిమందితో రుద్రప్రయాగ యాత్ర ముగించుకుని నేడు బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరకాశీ వద్ద వరద ముంచెత్తడంతో నాలుగురోజుల పాటు నరకం అనుభవించామని తెలిపారు. ఆ జలప్రళయాన్ని చూస్తే రుద్ర తాండవం చూసినట్టే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఏదేమైనా అదో భయంకర అనుభవం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News