: షర్మిల మౌనయాత్ర!
వైఎస్సార్సీపీ నేత షర్మిల తీరు పట్ల పలువురు నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రజాప్రస్థానం పేరిట ఆమె సాగిస్తున్న యాత్ర పలకరింపులు, ప్రసంగాలు ఏవీ లేకుండా మొక్కుబడిగా సాగిపోతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల నేడు తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలంలోని శాంతి ఆశ్రమం నుంచి పాదయాత్ర ఆరంభించారు. ఆమె ఏదో చెబుతుందని ఆశించిన ప్రజలకు ఆశాభంగం ఎదురైంది. షర్మిలను చూసేందుకు వచ్చిన జనం ఆమె తీరు పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రజలతో మమేకమైన దాఖలాల్లేకుండా వైఎస్ కుమార్తె ముందుకు వెళ్ళారు. దీంతో.. షర్మిల యాత్రను వైఎస్, చంద్రబాబు పాదయాత్రలతో పోల్చుకున్న ప్రజానీకం ఉసూరుమంటూ వెనుదిరిగారు.