: భారత ఆర్మీకి సలాం: భజ్జీ
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డందుకు ఆనందం వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇలాంటి వరదలను చూడలేదన్న భజ్జీ, తనను బయటకు తీసుకొచ్చిన ఆర్మీవాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. మూడు రోజుల పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల క్యాంపులో తలదాచుకున్న భజ్జీ ఆర్మీ ఎంతో సహాయం చేసిందని, వాళ్ల మేలు జన్మలో మరువలేనని తెలిపాడు.