: వరదల్లో భారీ సంఖ్యలో తప్పిపోయిన విశాఖ వాసులు
ఉత్తరాఖండ్ వరదల్లో విశాఖ జిల్లావాసులు 700 మంది చిక్కుకున్నారు. వీరంతా ఎక్కడ ఉన్నారో... ఎలా ఉన్నారో... అసలు ఉన్నారో లేదో అంతుచిక్కడం లేదు. వీరినుంచి వారి బంధువులకు సమాచారమందలేదు. వారి బంధువులు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తమవారి క్షేమసమాచారమడుగుతున్నారు. అధికారులకు ఇంకా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఇక్కడి వారంతా ఆందోళన చెందుతున్నారు.