: విలువైన ప్రజాధనం, శాసనసభా సమయం దుర్వినియోగం


రాష్ట్ర శాసన సభ నిరవధిక వాయిదాల పద్దతిలో కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా కేవలం ఒక్క సమస్యతోనే బాధపడుతున్నట్టుగా అధికార, ప్రతిపక్షాల వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసం సభను వాయిదాలతో నడిపేసి కాలం గడిపేశారు. పది రోజులపాటు జరిగిన శాసనసభ కేవలం 57 గంటల 29 నిమిషాల పాటు మాత్రమే నడిచింది. సింహ భాగం మొత్తం నినాదాలు గందరగోళాలతోనే సభ గడిచిపోయింది. పదేపదే పోడియాన్ని చుట్టుముడుతూ, ప్రజలు తమను సభకు అందుకే పంపించారన్నట్టుగా ఆ పనిని నెరవేరుస్తూ నేతలు తమ నిబద్దతను చాటుకున్నారు.

10 రోజుల అసెంబ్లీలో 16 బిల్లులు ఆమోదం పొందగా, 7 స్టాండింగ్ కమిటీ నివేదికల చర్చల్లో పాల్గొన్నది కేవలం 96 మంది సభ్యులు, 26 మంది మంత్రులు మాత్రమే. 57 గంటల 29 నిమిషాల సమయంలో కాంగ్రెస్ 25 గంటల 23 నిమిషాలు మాట్లాడి ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తే, టీడీపీ 11 గంటల 48 నిమిషాల కాలాన్ని వాడుకుంది. టీఆర్ఎస్ నినాదాలు చేసేందుకు 6 గంటల 9 నిమిషాల కాలాన్ని ఉపయోగించుకుంది.

ఎంఐఎం పార్టీ గంటా 53 నిమిషాలు వినియోగించుకుంది. బీజేపీ తనకు అందివచ్చిన గంటా 15 నిమిషాల సమయాన్ని ఆరోపణలకు నియోగించగా ఒకే సభ్యుడున్న లోక్ సత్తా 2 గంటల 24 నిమిషాలు మాట్లాడి ప్రజాసమస్యలపై గళమెత్తింది. రికార్డుల ప్రకారం సభా సమయం వృధాగా పోయినది 4 గంటల 42 నిమిషాలు. మన ప్రజాప్రతినిధులు ఇంత గొప్పగా పదిరోజుల విలువైన కాలాన్ని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నమాట!

  • Loading...

More Telugu News