: ఆ ఒక్క విషయంలో పాకిస్తాన్ దే పైచేయి!


భారత్ తో అన్ని విషయాల్లో పోటీపడే పాకిస్తాన్ ఒక్క అంశంలో మాత్రం పైచేయి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో మనకంటే పాకిస్తానీలే అధికంగా సొమ్ము దాచుకున్నారట. స్విస్ బ్యాంకుల్లో భారత కుబేరుల నల్లధనం రూ.9100 కోట్లు ఉండగా.. పాకిస్తాన్ జాతీయుల సొమ్ము రూ.9200 కోట్లని నివేదికలు తెలుపుతున్నాయి. భారత్ తో పోల్చితే విస్తీర్ణం పరంగా ఎంతో చిన్నదైన పాక్ లో ఇంత సొమ్మెక్కడిదబ్బా..? అని ప్రపంచవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పలుదేశాల్లో నల్లధనం పట్ల చైతన్యం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. భారత్, అమెరికా వంటి దేశాలు స్విస్ బ్యాంకులపై ఒత్తిడి పెంచాయి. రహస్య ఖాతాలను వెల్లడించాల్సిందే అని పట్టుబట్టడంతో స్విస్ బ్యాంకులు దిగొచ్చాయి.

  • Loading...

More Telugu News