: పెప్సి ఉద్యోగికి కోకాకోలా వల వేసిందా!


'పెప్సి కో' ఇండియా ప్రాంతానికి చెందిన ప్రెసిడెంట్ కు కోకాకోలా కంపెనీ వలవేసిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. కోకాకోలా సంస్థ తమ ఇండియా, వెస్ట్ ఏసియా సీఈవో, ప్రెసిడెంట్ అయిన అతుల్ సింగ్ కు పదోన్నతి కల్పించి పసిఫిక్ గ్రూపుకు డిప్యూటీ ప్రెసిడెంట్ గా నియమించి ఇక్కడనుంచి పంపించేసింది.

ఇది జరిగిన మరునాడే పెప్సికో ఇండియా ప్రాంత ప్రెసిడెంట్ మను ఆనంద్ రాజీనామా చేశారు. మను 19 ఏళ్లుగా పెప్సికి సేవలందించారు. మను వేరే సంస్థలో చేరడానికే తమ సంస్థకు రాజీనామా చేశారని, ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తామని పెప్సి ప్రకటించింది. దీంతో మను ఆనంద్ ను అతుల్ సింగ్ స్థానంలో కోకాకోలా నియమించుకుందనే వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News