: బాగా ఆడితే.. మా బాగా ముట్టజెపుతాం: ఆటగాళ్ళతో పాక్ క్రికెట్ బోర్డు
ఇటీవలి పరాజయాలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మేలుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ళు సైతం పేలవ ప్రదర్శన కనబరస్తుండడంతో పీసీబీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఈ క్రమంలో బాగా ఆడినవాళ్ళకు భారీ పారితోషికాలు చెల్లించాలని నిర్ణయించింది. గత ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో ఉన్న క్రికెటర్లకు పారితోషికంతో పాటు మ్యాచ్ ఫీజును రెండుసార్లు పెంచింది. అయితే, ఈ చర్య ఆటగాళ్ళ ప్రదర్శనను ప్రభావితం చేయలేకపోయింది. దీంతో, ఉత్తమ ప్రదర్శన చూపిన వాళ్ళకే పారితోషికం పెంపు అమలు చేయాలని పీసీబీ భావిస్తోంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో పరాజయంపాలై టోర్నీ నుంచి అవమానకరరీతిలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే.