: కేదార్ నాథ్ తుడిచి పెట్టుకుపోయింది


ప్రముఖ శైవ క్షేత్రంగా అలరారుతున్న కేదార్ నాథ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాఖండ్ విపత్తు ఈ సహస్రాబ్దిలోనే అత్యంత విషాదకర ఘటనగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకృతి బీభత్సం నుంచి కోలుకునేందుకు కనీసం ఐదేళ్లు పడుతుందన్న వ్యవసాయ శాఖా మంత్రి, కేదార్ నాథ్ లో సర్వం భూస్థాపితమైందని తెలిపారు. 16 అడుగుల కంటే అధికంగా వచ్చిన వరద ధాటికి పవిత్ర క్షేత్ర పరిసరాలన్నీ శ్మశానంగా మారిపోయాయని ఐదుగంటలపాటు ఇక్కడ పర్యటించిన ఉత్తరాఖండ్ వ్యవసాయ శాఖా మంత్రి హరక్ సింగ్ రావత్ తెలిపారు.

  • Loading...

More Telugu News