: హిండల్గ జైలులో ఉరికి సర్వం సిద్ధం


బెల్గాంలోని హిండల్గ కారాగారం. ఉరిశిక్ష పడిన నలుగురు వీరప్పన్ అనుచరులు అక్కడే నిర్బంధంలో ఉన్నారు. ఉరితీతకు సమయం దగ్గర పడుతోంది. ఈ జైలులో ఒక దోషిని చివరి సారిగా 1983లో ఉరితీశారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఉరి అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దోషి చనిపోయే వరకూ ఎలా ఉరితీయాలనే దానిపై జైలు సిబ్బందికి  తర్పీదు కూడా పూర్తయింది. రిహార్సల్స్ కూడా చేశారు.

ఏ రోజు ఏ సమయానికి ఉరి తీయాలో మైసూర్ సెషన్స్ కోర్టు నేడు నిర్ణయించబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను అందుకునేందుకు జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే మైసూర్ చేరుకున్నారు. కోర్టు ఆదేశించడం ఆలస్యం ,ఏ క్షణంలోనైనా నలుగురు దోషులను ఉరి కంభం ఎక్కించడానికి జైలులో రంగం సిద్ధం అయింది. 

  • Loading...

More Telugu News