: జయలలిత 'అమ్మ మినరల్ వాటర్'
అతి తక్కువ ధరకే మంచినీళ్ల అమ్మకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. దీనికి 'అమ్మ మినరల్ వాటర్' అనే పేరు పెట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై వాటర్ బాటిళ్ల ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉందని, అందుకే 10 రూపాయలకే మంచినీళ్ల బాటిల్ అందిస్తున్నామని జయలలిత చెప్పారు. ముఖ్యంగా రైల్వే ప్రయాణీకులకు ఈ బాటిళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.