: చెన్నై ఆటగాళ్లకు ఫ్లాట్లు ఇచ్చిన బుకీ: లలిత్
ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ సంచలన ఆరోపణలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ముగ్గురు క్రికెటర్లకు ఓ బుకీతో సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఆ బుకీ ఆటగాళ్లకు ఫ్లాట్లను బహూకరించాడంటూ గుట్టు విప్పారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో బుక్కై పదవిని కోల్పోయిన సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ గురునాథ్ మీయప్పన్ తో ఆ వ్యాపారికి దగ్గరి సంబంధాలున్నాయని చెప్పారు.
2010లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సొంతం చేసుకోవాలని ఆ వ్యాపారి ప్రయత్నించారని, కుదరకపోయేసరికి ఆటగాళ్లకు బహుమతులు పంచిపెట్టారని లలిత్ వెల్లడించారు. ముంబై, ఢిల్లీ, నోయిడాలలో ఫ్లాట్లను బహుమతులుగా ఇచ్చారంటూ లలిత్ మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే, ఆ వ్యాపారి వివరాలను బయటపెట్టలేదు. తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ వివరాలు తెలిశాయని అందులో చెప్పారు.