: గనుల ఎండీని ప్రశ్నిస్తున్న సీబీఐ
గనులశాఖ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలామందిని విచారిస్తున్న సీబీఐ సుశీల్ కుమార్ ను అనేక కోణాల్లో ప్రశ్నిస్తోంది. హైదరాబాదులోని దిల్ కుషా కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో గనులశాఖ ఎండీ పూర్తిగా సహకరిస్తున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకునేందుకు సీబీఐకి అవకాశం దొరికింది.