: భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది: అమెరికా
భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని అమెరికా సెక్రటరీ జనరల్ జాన్ కెర్రీ అన్నారు. వాషింగ్టన్ లో ఈ ఉదయం మాట్లాడిన కెర్రీ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. భారత్, అమెరికా వ్యూహాత్మక చర్చల్లో భాగంగా ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రాపంచిక అంశాల్లో రెండు దేశాల పూర్తి స్థాయి సహకారానికి సంబంధించి భారత ప్రతినిధులతో చర్చించనున్నారు. అలాగే ప్రాంతీయ భద్రత, రక్షణ, ఆర్థిక స్థితిగతులు, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారంపై ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
కాగా తాజాగా సిరియా, అఫ్ఘనిస్థాన్ లలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, భారత సహకారంపై అమెరికా ఆందోళనతో చర్చలకోసం కెర్రీ భారత్ పర్యటనకు వస్తున్నట్టు భారత దౌత్యాధికారులు చెబుతున్నారు. మరో వైపు కెర్రీ భారత్-అమెరికా ఉన్నత విద్యపై ద్వైవార్షిక చర్చలను ప్రారంభిస్తారని, ఇంధన శుద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పేదరికం నిర్మూలనకు పాటుపడుతున్న యువనేతలను, ఆవిష్కర్తలను తన పర్యటన సందర్భంగా కలుసుకుంటారని భారత దౌత్యాధికారులు తెలిపారు.