: కేదార్ నాథ్ వద్ద ఐదుగురు తెలుగు యాత్రికుల మృతి
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన మరో ఐదుగురు తెలుగు వారు కేదార్ నాథ్ సమీపంలో వరదల్లో చిక్కుకుని మృతి చెందారు. మృతులలో తోట్లవల్లూరు మండలం పెనమకూరుకు చెందిన పెద్దిదేవి సరోజిని, సూరపునేని సుశీల, నాగలక్ష్మి, రాజేంద్రప్రసాద్, ఆయన తల్లి ఉన్నారు. ఈ మేరకు వారి బంధువులకు సమాచారం అందింది. ఇప్పటి వరకూ కృష్ణా జిల్లాకు చెందిన మొత్తం 13 మంది ఆచూకీ లేకుండా పోయిందని సమాచారం. వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు.