: అక్రమాస్తులు లేకుంటే నా కాళ్లు పట్టుకుంటారా?: కేటీఆర్
కేసీఆర్ కుటుంబ సభ్యుల అక్రమాస్తులు, సెటిల్ మెంట్లపై వార్తలు వస్తుండడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తమ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఎవరితోనైనా విచారణ జరిపించుకోవచ్చన్నారు. తన సెటిల్ మెంట్లపై వస్తున్న ఆరోపణలపై కూడా విచారణకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. విచారణలో అక్రమాస్తులు లేవని తేలితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నారంటూ ఏబీఎన్ కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.