: సీమాంధ్ర నేతల మీటింగ్
ప్యాకేజీ వార్తలకు తెలంగాణ నేతల్లో ఏర్పడిన స్పందన సీమాంధ్ర నేతలను కూడా కదిలించింది. సమైక్యాంధ్ర కోసం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని వారంతా నిర్ణయించుకున్నారు. అందుకే సీమాంధ్ర నేతలంతా కలసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో రేపు సీమాంధ్ర నేతలు సమావేశం కానున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సమైక్యాంధ్ర దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు.