: బ్రిటన్ యువరాణి 'సహజ' కోరిక


బ్రిటన్ యువరాణి, ప్రిన్స్ విలియమ్ భార్య కేట్ మిడిల్ టన్ తన తొలిబిడ్డను సహజ ప్రసవం ద్వారానే కనాలని కోరుకుంటోంది. కష్టమైనాసరే ఈ పద్ధతిలోనే జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. తన భర్త విలియమ్ కళ్లు తెరచిన సెయింట్ మేరీస్ ఆస్పత్రిలోనే కేట్ ప్రసవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఇది ఉంటుందని సమాచారం. పుట్టబోయే బిడ్డ బుల్లి రాజా? రాణా? అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే, బ్రిటన్ మీడియాకు ఎలా తెలుసోగానీ కేట్ ఆడబిడ్డకే జన్మనివ్వనున్నారంటూ కథనాలు ప్రసారం చేశాయి.

  • Loading...

More Telugu News