: మహాధర్నా కార్యక్రమాన్ని రద్దు చేసిన టీడీపీ


కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు నీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహాధర్నా రద్దయింది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలే ఇందుకు కారణం. కృష్ణా జలాలు వెంటనే విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని శనివారం గవర్నర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు కలిసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోవడంతో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు కూచిపూడి వద్ద భారీ ఎత్తున మహాధర్నా చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయిన తరుణంలో సాగునీటి కోసం ధర్నాచేయడం సమయోచితం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News