: ముగ్గురిలో ఒకరు గృహహింస బాధితులేనట


నేడు ఎక్కడ చూసినా మహిళలను వేధిస్తున్న సంఘటనలే మనకు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింస బాధితులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసపై నిర్వహించిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఈ సంస్థ గురువారం నాడు వెల్లడించింది. ఈ అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు ముఫ్ఫై శాతం మంది మహిళలు తమ భర్తల చేతుల్లో హింసకు గురవుతున్నారని తేలింది. ఈ హింస ఆసియా, మధ్య తూర్పు దేశాల్లో మరింత ఎక్కువగా ఉందని ఈ సంస్థ చెబుతోంది.

ప్రపంచంలో జరుగుతున్న మహిళల హత్యల విషయంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మహిళల హత్యలో సుమారు 38 శాతం భర్తలు చేసినవేనని ఈ సంస్థ పేర్కొంది. మహిళల గృహహింస విషయంలో ఆసియా దేశాల్లో మరీ ఎక్కువగా ఉందని డబ్ల్యూ హెచ్‌ఓ కుటుంబం, మహిళలు, శిశు ఆరోగ్య విభాగాధికారి ఫ్లావియ బస్టెరో తెలిపారు. బంగ్లాదేశ్‌, తూర్పు తైమూర్‌, భారత్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌ల్యాండ్‌ వంటి దేశాల్లో సుమారు 37.7 శాతం మహిళలు గృహహింస అనుభవిస్తున్న వారేనని, దీని తర్వాత స్థానాన్ని తూర్పు దేశాలు 37 శాతంతో ఆక్రమించగా, ఇది ఆఫ్రికాలో 36.6 శాతం ఉండగా, అభివృద్ధి చెందిన ఉత్తర అమెరికా, ఐరోపా సమాఖ్యదేశాలు, జపాన్‌, దక్షిణ కొరియా, ఆష్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ వంటి దేశాల్లో ఈ హింస 23.2 శాతంగా ఉందని ఈ అధ్యయన నివేదిక చెబుతోంది.

  • Loading...

More Telugu News