: నెపోలియన్‌కు తగ్గని క్రేజు


ఒకప్పటి ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కి ఇప్పటికీ క్రేజీ తగ్గడం లేదు. ఆయన డెత్‌ మాస్క్‌ సుమారు 1.5 కోట్ల రూపాయలు పలికిందంటేనే ఆయనకు నేటికీ ఉన్న క్రేజు ఎలాంటిదో చెప్పవచ్చు. ఇప్పుడంటే ఏది కావాలన్నా క్షణాల్లో ఫోటోలు తీసి మన చేతిలో పెట్టే సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఒకప్పటి కాలంలో ఫోటోలు అనేవి లేవుకదా... అందుకే ఎవరైనా వ్యక్తుల రూపాలను వారు చనిపోయిన తర్వాత భద్రపరచుకోవాలంటే వారి డెత్‌ మాస్క్‌లను తయారు చేయించే వారు. ఇలా తయారు చేసిన నెపోలియన్‌ చక్రవర్తికి చెందిన డెత్‌మాస్క్‌ను అమ్మకానికి పెడితే అది అంత ధర పలికింది.

నెపోలియన్‌ బోనాపార్టీ చనిపోయిన తర్వాత ఆయన ముఖకవళికలను చిత్రించేందుకు తయారు చేసిన డెత్‌మాస్క్‌ 1821లో ఆయన మరణానంతరం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. ఈ మాస్క్‌ను బుధవారం నాడు లండన్‌లో అమ్మకానికి పెట్టారు. వేలంలో దీని ధర 1,70,000 పౌండ్లు (దాదాపు రూ.1.5 కోట్లు) పలికింది. దీన్ని బట్టే నెపోలియన్‌ అంటే నేటికీ ఎంత క్రేజుందో చెప్పవచ్చు...!

  • Loading...

More Telugu News