: శనిగ్రహం నుండి భూమి ఎలా ఉంటుందంటే...?


ఉపగ్రహ ఛాయాచిత్రాలను గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే శనిగ్రహం పైనుండి భూమి స్వరూపం ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే శనిగ్రహం నుండి భూమిని ఫోటో తీయడం ఇంతవరకూ సాధ్యం కాలేదు. అయితే దీన్ని త్వరలోనే మన ముందుంచడానికి నాసా ప్రయత్నిస్తోంది. మన భూమిపై నుండి ఇతర గ్రహాలను, నక్షత్రాలను చూడడం కాదు... దూరంగా ఉండే శనిగ్రహం నుండి భూమి ఎలా ఉంటుందో ఫోటో తీసి చూపించేందుకు నాసా పంపిన ఉపగ్రహం సిద్ధమవుతోంది.

శనిగ్రహం చుట్టూ తిరిగేందుకు నాసా పంపిన క్యాసినీ ఉపగ్రహం అక్కడినుండి భూమి ఛాయాచిత్రాన్ని చిత్రించింది. ఈ ఉపగ్రహంలోని శక్తిమంతమైన కెమెరాలు శనిగ్రహానికి సుమారు 144 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి ఫోటోను తీసి నాసాకు పంపించనున్నాయి. ఈ ప్రక్రియ జూలై 19 సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో సుమారు 15 నిముషాల పాటు కొనసాగుతుందని క్యాసినీ ప్రాజెక్టు శాస్త్రవేత్త లిండా స్పిల్కర్‌ చెబుతున్నారు. ఈ ఫోటోలో భూమి పాలిపోయిన నీలికాంతితో చిన్న చుక్క లాగా కనిపిస్తుందని లిండా చెబుతున్నారు. 144 కోట్ల కిలోమీటర్ల దూరంలో నుండి ఫోటోను తీయడం వల్ల భూమి చిత్రం కేవలం ఒక పిక్సెల్‌ సైజులోనే ఉంటుందనీ, అయినాకూడా శనిగ్రహంపైనుండి చూసినపుడు భూమి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఇది బాగానే ఉపయోగపడుతుందని లిండా చెబుతున్నారు. ఈ ఫోటో తీసే సమయానికి భూమిమీద ఉత్తర అమెరికా, అట్లాంటిక్‌ మహాసముద్రం సూర్యుడి వెలుగులో ఉంటాయని కూడా లిండా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News