: చప్పట్లు ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయట


చప్పట్లు కొట్టడం అనేది ఒకరి నుండి మరొకరికి సంక్రమించే స్వభావమట. ఒకరు చప్పట్లు కొడుతుంటే దాన్ని చూసి మరొకరు చప్పట్లు కొడతారని ఒక తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. ఏదైనా ఒక సభలోగానీ, సమావేశంలోగానీ లేదా ఇంకేదైనా కార్యక్రమంలోగానీ ప్రేక్షకులు చేసే కరతాళ ధ్వనులు కచ్చితంగా ఎదుటివారిని ప్రభావితం చేస్తాయట. అంటే కార్యక్రమంలోని ఏదైనా ఒక అంశం మనకు నచ్చి కరతాళధ్వనులు చేయడం ప్రారంభిస్తే మనం కొట్టే చప్పట్లు చూసి మన పక్కనుండేవారు అందరూ చప్పట్లు కొడతారని పరిశోధకులు చెబుతున్నారు.

చప్పట్లు కొట్టడం అనేది సభలో వక్త ప్రసంగం బాగుందనో లేదా సభా కార్యక్రమాలు చక్కగా సాగుతున్నందుకో లేదా ఏదైనా ఒక అంశాన్ని ప్రదర్శించే వ్యక్తి ప్రదర్శన చక్కగా ఉందనో చెప్పడానికి మనం కొట్టే చప్పట్లు ఇతరులను బాగా ప్రభావితం చేస్తాయని ఈ పరిశోధకుల బృందానికి సారధ్యం వహించిన డాక్టర్‌ రిచర్డ్‌ మాన్‌ చెబుతున్నారు. మొదట ఎవరో ఒకరు చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే ఇక ఆ ప్రాంగణంలోని మిగిలిన వారంతా కూడా అసంకల్పితంగానే చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారని ఆయన చెబుతున్నారు. కాబట్టి మీరేదైనా కార్యక్రమాన్ని నిర్వహించదలచుకుంటే... చప్పట్లు కొట్టేందుకు కొందరిని ఏర్పాటు చేసుకోండి. అప్పుడు ప్రేక్షకులంతా కూడా చప్పట్లు కొట్టేస్తారు...!!

  • Loading...

More Telugu News