: వరదల్లో గల్లంతైన వారికోసం గూగుల్ 'యాప్'
ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ఉపకరించే వినూత్న అప్లికేషన్ ను గూగుల్ నేడు ఆవిష్కరించింది. ఈ కొత్త యాప్ పేరు పర్సన్ ఫైండర్. ఈ వెబ్ అప్లికేషన్ ద్వారా సమాచారం పోస్ట్ చేయడంతోపాటు వరదల్లో ఆచూకీలేకుండా పోయిన వారిని వెతికిపట్టుకునేందుకు వీలవుతుందని గూగుల్ పేర్కొంది. ఈ యాప్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభిస్తుందని గూగుల్ వర్గాలు తెలిపాయి.