: ఓపెనర్ల జోరుకు మాథ్యూస్ బ్రేక్
చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో శ్రీలంకపై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. 182 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో.. శిఖర్ ధావన్ (36 బ్యాటింగ్), రోహిత్ శర్మ (33) తొలి వికెట్ కు 77 పరుగులు జోడించారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగిపోతున్న ఈ ఓపెనింగ్ జంటను లంక సారథి మాథ్యూస్ విడదీశాడు. ఓ చక్కని బంతితో రోహిత్ ను బౌల్డ్ చేశాడు. దీంతో, 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.