: వరద బాధితులకు బాలీవుడ్ 'టైగర్' భారీ విరాళం
ఉత్తరాఖండ్ వద్ద వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ, 'టైగర్' శత్రుఘ్నసిన్హా ఎంపీ లాడ్స్ నుంచి భారీ విరాళం ప్రకటించారు. బాధితుల పునరావాసం కోసం రూ.50 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. పాట్నాలో నేడు మీడియాతో మాట్లాడుతూ, బాధితులకు చేయూతనిచ్చేందుకు మరికొందరు ఎంపీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.