: ఉత్తరకాశీలో ఆచూకీ లేకుండా పోయిన 146 మంది కృష్ణాజిల్లా వాసులు
చార్ ధామ్ యాత్ర కోసమని వెళ్ళి ఉత్తరకాశీ వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 146 మంది కృష్ణాజిల్లా వాసుల ఆచూకీ తెలియడంలేదు. అధికారుల లెక్కల ప్రకారం గల్లంతైన వారిలో అత్యధికంగా విజయవాడ డివిజన్ కు చెందినవారే 82 మంది ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు బాధితుల కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తమవాళ్ళ గురించి సమాచారం అందించడంతో 146 మంది గల్లంతైన విషయం వెల్లడైంది.