: దుబాయ్ లో ఖురాన్ ను ప్రతిబింబించే పార్కు


ప్రపంచం విస్తుపోయేలా భారీ కట్టడాలను నిర్మించే దుబాయ్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ స్పూర్తిని చాటేలా ఓ థీమ్ పార్కు నిర్మాణానికి నడుంబిగించింది. రూ.41 కోట్ల నిధులను ఈ పార్కు నిర్మాణ పనుల కోసం కేటాయించారు. ఖురాన్ లో పేర్కొన్న కొన్ని రకాల మొక్కలను ఈ పార్కులో చూడవచ్చని నిర్వాహకులంటున్నారు. ఈ వినూత్న తరహా పార్కు 2014 సెప్టెంబర్ నాటికి తుదిమెరుగులు దిద్దుకుంటుందని దుబాయ్ నగర డైరక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మహ్మద్ నూర్ మష్రూమ్ తెలిపారు. కాగా, ఈ పార్కును ముస్లిం దేశాల ప్రజలు పెద్ద ఎత్తున సందర్శిస్తారని ఇస్లామిక్ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News