: రూపాయి దెబ్బకు పడిపోయిన వెండి, బంగారం ధరలు
స్టాక్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్ కుదేలైపోగా, స్టాక్ మర్కెట్ నష్టాలు బంగారం, వెండి ధరల పుట్టిముంచాయి. దీంతో బంగారం తులానికి 400 తగ్గిపోయి 28000 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1500 తగ్గి 43,100కి చేరుకుంది. అయితే బంగారం ధర తగ్గిందని కొనవద్దని, గత కొంత కాలంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో రూపాయి విలువ తగ్గిపోతోందని, రూపాయిని పటిష్టపరిచే చర్యలు ప్రభుత్వంతో పాటు ప్రజలూ తీసుకోవాలని సూచిస్తూ వస్తున్నారు. రూపాయి మరింత పతనం చెందితే పెట్టుబడులపై కూడా ఆ ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.