: బాలమేధావికి హార్వర్డ్ సీటు
పిట్టకొంచెం కూత ఘనం అన్న నానుడి అతనికి సరిగ్గా సరిపోతుంది. వయసు ఐదేళ్లే కానీ, అతని ఐక్యూ ఐన్ స్టీన్ ఐక్యూతో సమానం. ఈ వయస్సులోనే ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చేరి క్వాంటమ్ ఫిజిక్స్ చదవబోతున్నాడు. మెక్సికో సిటీకి చెందిన లూయీ రాబర్టో రమిరెజ్ మహా మేధావి. రెండేళ్ల క్రితం తన తోటిపిల్లలతో ఆటల్లో పడుతున్న ఇబ్బందిని గమనించిన అతని తల్లిదండ్రులు నిపుణులను సంప్రదించారు. వారి పరిశీలనలో రమిరెజ్ ఐక్యూ 152-160 మధ్య ఉన్నట్టు తేలింది. ఒక కంపెనీ పెట్టి తన ఆవిష్కరణలను విక్రయించాలన్నది రమిరెజ్ ఆశయం. ప్రస్తుతం రమిరెజ్ హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకోనున్నాడు.