: అసోంలో కిడ్నాప్ కు గురైన విశాఖ ఇంజనీర్
విశాఖపట్నానికి చెందిన పైడిరాజు అనే ఇంజనీర్ అసోంలో కిడ్నాప్ కు గురయ్యారు. ఆదివారం నాడు గుర్తు తెలియని కొంతమంది దుండగులు ఈ పని చేశారని అతని తోటి ఉద్యోగులు అసోం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే ఇంజనీర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, బోడో తీవ్రవాదులే ఆయనను అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంజనీర్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.