: మ్యాచ్ వర్షార్పణం అయితే... ఫైనల్లో టీమిండియా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రతిమ్యాచ్ కూ వరుణుడు మోకాలడ్డుతుండడంతో సగం టోర్నీ వర్షార్పణమైపోయింది. తాజాగా సెమీస్ లో శ్రీలంక, భారత్ లమధ్య మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా లైట్ ఫెయిల్ కారణంగా లేట్ గా మైదానంలోకి దిగింది. వాతావరణం మబ్బుపట్టి ఉంది. వర్షం పడే అవకాశముందని బ్రిటన్ వాతావరణ శాఖ తేల్చిచెప్పడంతో మ్యాచ్ పూర్తిగా కొనసాగేది అనుమానమే. ఒక వేళ ఏ కారణంగానైనా మ్యాచ్ జరగకపోతే మాత్రం నెట్ రన్ రేట్ ప్రకారం టీమిండియా ఫైనల్ కు చేరుతుంది. కార్డిఫ్ లో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక నాలుగు ఓవర్లలో పెరీరా వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది.