: ప్చ్.. మ్యాచ్ లేటైంది!
చాంపియన్స్ ట్రోఫీలో వరుణుడి హవానే ఎక్కువగా సాగినట్టుంది. నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీఫైనల్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. కార్డిఫ్ వేదికగా ఆరంభమవ్వాల్సిన ఈ పోరుకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని ఇక్కడి వాతావరణ శాఖ అంటోంది. అయితే, అభిమానులకు ఊరట కలిగిస్తూ.. టీమిండియా సారథి ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.