: షర్మిలను జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించిన నల్గొండ పోలీసులు
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా రేపు జిల్లాను వదిలి వెళ్లాలని వైయస్ షర్మిలను నల్గొండ జిల్లా పోలీసులు కోరారు. 'మరో ప్రజా ప్రస్థానం' పేరిట షర్మిల ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే, జిల్లాలో ఈ 21న ఎమ్మెల్సీ ఎన్నిక ఉండడంతో, రేపటి నుంచి ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. ఈ సమయంలో ఇతర ప్రాంతాల నేతలు జిల్లాలో వుండకూడదు. దాంతో పోలీసులు షర్మిలకు ఈ ఆదేశాలు జారీ చేశారు.