: ఆరెస్సెస్ చీఫ్ తో అద్వానీ భేటీ
ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఈ రోజు సమావేశమయ్యారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి, ఉపసంహరించుకున్న అనంతరం తొలిసారిగా ఇప్పుడే భగవత్ ను అద్వానీ కలుసుకోవడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి సంబంధించిన అన్ని అంశాలనూ భగవత్ తో అద్వానీ చర్చించినట్లు సమాచారం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంశం గురించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. 75 నిమిషాలపాటు వీరి చర్చ కొనసాగింది.