: అంతరిక్షం నుంచి లెక్చర్ దంచిన చైనా వ్యోమగామి


చైనా అంతరిక్ష రంగంలో దూసుకెళుతోన్న సంగతి తెలిసిందే. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలకు దీటుగా ఖగోళ రహస్యాల గుట్టు విప్పే పలు ప్రాజెక్టులను చైనా నిర్వహిస్తోంది. గగనసీమల్లో అమెరికా, రష్యా స్పేస్ స్టేషన్లను నిర్మిస్తే తానూ సై అంది. తియాన్ గాంగ్-1 పేరిట ఓ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అంతేగాకుండా మానవసహిత రోదసీయాత్రలను సైతం ఎలాంటి అవాంతరాల్లేకుండా చేపడుతోంది. తాజాగా, తియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి ఓ మహిళా వ్యోమగామి చైనాలోని బాలబాలికలకు పాఠం బోధించింది.

వాంగ్ యాపింగ్ అనే ఈ వ్యోమగామి 330 మంది బీజింగ్ హైస్కూల్ విద్యార్థులతో ఈ స్పేస్ క్లాస్ రూమ్ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మొత్తం 51 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో యాపింగ్.. భారరహిత స్థితి, నీటి తలతన్యత వంటి భౌతికశాస్త్ర సిద్ధాంతాలను చిన్నారులకు వివరించిందట.

  • Loading...

More Telugu News