: అన్నీ అబద్దాలే... నాపై కక్షగట్టారు: మాజీమంత్రి శంకర్రావు
శంకరన్న మరోసారి ప్రత్యర్ధులపై పళ్లు నూరారు. తన కోడలంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను ఈ మాజీ మంత్రి ఖండించారు. మూడేళ్ల క్రితమే డ్రైవర్ తో వెళ్లిపోయిన ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని శంకర్రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకే అధికారపక్షంలోని కొంతమంది నేతలు తనపై కక్షగట్టారన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై స్పందిస్తున్నందు వల్లే తనను టార్గెట్ చేస్తున్నారని పరోక్షంగా సీఎంను విమర్శించారు. తనపై ఇలాంటి చర్యలు కొనసాగితే తెలంగాణలో పార్టీ భూస్థాపితమౌతుందని మాజీ మంత్రి శంకర్రావు అభిప్రాయపడ్డారు.