: మరో రెండు రోజుల్లో ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
భారీ వర్షాల కారణంగా వరదలతో చిన్నాభిన్నమైన ఉత్తరాఖండ్ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. అక్కడ చిక్కుకున్న వేలాది మంది తెలుగువారు మెల్లగా ఒడ్డున పడుతున్నారు. అయితే, ఈలోపే మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ వినిపించింది. జూన్ 22 నుంచి 25లోపు మళ్లీ అక్కడ సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగవచ్చని పేర్కొంది.