: కేదార్ నాథ్ కు మూసుకుపోయిన అన్నిదారులు


వరదల కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ కు అన్ని దారులూ తెగిపోయాయని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ డీజీ అజయ్ చద్దాని తెలిపారు. వాయు మార్గంలో మాత్రమే అక్కడకు చేరుకోవడానికి అవకాశం ఉందన్నారు. అననుకూల వాతావరణం కారణంగా సహాయక కార్యక్రమాలకు విఘాతం కలుగుతోందని చెప్పారు. కేదార్ నాథ్, గుప్తకాశీ మార్గంలో కొండల నడుమ సన్నని దారులలో ప్రయాణించడం కష్టంగా ఉందని వాయుసేన అధికారులు ప్రకటించారు. శుక్రవారం నాటికి పరిస్థితులు మెరుగు పడవచ్చన్నారు.

  • Loading...

More Telugu News