: నా తీర్పు మహిళలకు రక్షా కవచం: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి


స్త్రీపురుషుల మధ్య అక్రమ సంబంధానికి రెండు రోజుల కిందట కొత్త నిర్వచనం ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీకే కర్ణన్ తాజాగా దాన్ని విపులీకరించారు. 21ఏళ్లు నిండిన బ్రహ్మచారి, 18ఏళ్లు నిండిన యువతితో వివాహానికి ముందుగా లైంగిక సంబంధం పెట్టుకుంటే, వారు వివాహితులైనట్లేనని రెండు రోజుల కిందట ఒక కేసులో న్యాయమూర్తి కర్ణన్ తీర్పు చెప్పారు. ఆ యువతి అతడి భార్యగా పూర్తి హక్కులు సంతరించుకున్నట్లేనని చెప్పారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జస్టిస్ తన తీర్పును మరింత విపులీకరించి చెప్పారు. తన తీర్పు సాంస్కృతిక సామరస్యాన్ని కాపాడుతుందని, మహిళలకు రక్షణనిస్తుందని స్పష్టం చేశారు. ఏ మతానికీ, ఏ భారతీయుడికీ ఈ తీర్పు వ్యతిరేకం కాదన్నారు. భిన్న మతాల వివాహ వ్యవస్థలకు ఈ తీర్పు విఘాతం కలిగించదని పేర్కొన్నారు. వివాహం చేసుకుంటాననే హామీతో లైంగిక సంబంధం పెట్టుకుని తర్వాత తిరస్కరిస్తే.. న్యాయం కోసం సదరు మహిళ కోర్టును ఆశ్రయించవచ్చని, అతడిపై క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. అలాంటి కేసులో భాగంగానే బాధితురాలికి కోర్టు ఉపశమనం కల్పించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News